"జగన్" అంటూ ఏకవచనంలో పిలవడాన్ని పవన్ మానుకోవాలి: వెల్లంపల్లి

  • ఇటీవల "జగన్" అంటూ పవన్ ఏకవచన సంబోధన
  • చెప్పి మరీ పిలుస్తున్న జనసేనాని
  • తీవ్రంగా మండిపడిన వెల్లంపల్లి
  • మర్యాద అనిపించుకోదంటూ హితవు
  • 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ పసన్ కు సవాల్
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. జగన్ అంటూ ముఖ్యమంత్రిని ఏకవచనంలో పిలవడం మానుకోవాలని హితవు పలికారు. 

"ఏకవచనంతో పిలిచినంత మాత్రాన మీరు హీరో అనుకుంటున్నారేమో... అది గతం. రాజకీయాల్లో జీరో అయిన మీరు ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా జీరో అయిపోయారు... కావాలంటే చూసుకోండి. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ జీరో అయిన మీరు మా జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. సీఎంను ఏకవచనంతో పిలుస్తూ విమర్శలు చేయడం మర్యాద అనిపించుకోదు. 

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా మా ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వానికి మాత్రమే ఉంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అని చెప్పే దమ్ముందా మీకు?" అంటూ వెల్లంపల్లి తీవ్రస్థాయిలో స్పందించారు.


More Telugu News