పాడేరు బస్సు ప్రమాద ఘటనపై చంద్రబాబు స్పందన
- అల్లూరి జిల్లాలో అదుపుతప్పి లోయలో పడిన ఆర్టీసీ బస్సు
- ఇద్దరు ప్రయాణికుల మృతి
- విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
- మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి
- ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
బాధితులకు మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్పష్టం చేశారు. అసలు, ప్రమాదానికి గల కారణాలను వెలికి తీసేందుకు ఘటనపై విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కాగా, పాడేరు ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరిని నర్సీపట్నం ఆసుపత్రికి, మరికొందరిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు.