సుహాస్ స్పీడు మామూలుగా లేదు.. చేతిలో ఇన్ని సినిమాలా?
- నిన్న సుహాస్ పుట్టిన రోజు
- కొత్త పోస్టర్లను విడుదల చేసిన చిత్ర బృందాలు
- కలర్ ఫొటో చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు
షార్ట్ వీడియోలతో ప్రతిభను చాటుకొని చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్‌లో మెప్పించిన నటుడు సుహాస్. కలర్ ఫొటో చిత్రంతో అతని దశ తిరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో హీరోగా బిజీ అయ్యాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వైవిధ్యమైన కథలతో పాటు అతని సినిమాలకు అంతే డిఫరెంట్ టైటిల్స్ పెడుతున్నారు దర్శకులు. వాటిలో ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రం ఒకటి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుహాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని నిన్న రిలీజ్ చేశారు.
ఇందులో సుహాస్ పల్లెటూరి కుర్రాడి గెటప్‌లో ఆకట్టుకుంటున్నాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్‌లో సుహాస్ కనిపించనున్నాడు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కేబుల్ రెడ్డి అనే చిత్రం రెండు రోజుల కిందట మొదలైంది. రామ్ పసుపులేటి దర్శకత్వంలో ఆనందరావ్ అడ్వంచర్స్ అనే సినిమాలోనూ సుహాస్ నటిస్తున్నాడు. ప్రసన్నవదనం అనే సినిమాలోనూ సుహాస్ హీరోగా చేస్తున్నాడు.