నేడు ఐర్లాండ్‌తో భారత్ రెండో టీ20.. వాతావరణం ఎలా ఉందంటే?

  • జోరుమీదున్న బుమ్రాసేన
  • రాత్రి 7.30 నుంచి డబ్లిన్‌లో మ్యాచ్
  • తొలి పోరుకు అంతరాయం కలిగించిన వర్షం 
దాదాపు 11 నెలల తర్వాత పునరాగమనం చేసిన జస్‌ప్రీత్‌ బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఐర్లాండ్‌తో తొలి టీ20లో విజియం సాధించిన టీమిండియా అదే జోరుతో ఈ రోజు జరిగే రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ గెలవాలని చూస్తోంది. మొదటి మ్యాచ్‌లో బౌలర్లు రాణించగా.. ఈసారి బ్యాటర్ల నుంచి అలాంటి ప్రదర్శన ఆశిస్తోంది. డబ్లిన్ లో ఆదివారం వర్ష సూచన లేదు. రోజంతా ఎండ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కానీ, యూకేలో వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ పోరుకు వర్షం ఇబ్బంది పెట్టకుండా పూర్తి మ్యాచ్‌ జరగాలని ఇరు జట్లూ కోరుకుంటున్నాయి. 

మరోవైపు సోమవారం ఆసియా కప్‌కు భారత జట్టును ఎంపిక చేయనుండగా తమ ఆటతో సెలెక్టర్లను మెప్పించ్చేందుకు భారత కుర్రాళ్లకు ఇది సువర్ణావకాశం కానుంది. యశస్వి, రుతురాజ్, తిలక్ వర్మ, శివం దూబే, రింకూ సింగ్ తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ కు ఈ సిరీస్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి పోరులోనే ఆడిన తుది జట్టును కొనసాగించే అవకాశం ఉంది.


More Telugu News