కీలక వ్యవస్థల్లో ఆరెస్సెస్ మనుషులున్నారన్న రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన గడ్కరీ

  • రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కేంద్రమంత్రి గడ్కరీ
  • రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న కేంద్రమంత్రి
  • మంత్రులు తీసుకునే నిర్ణయాల్లో ఆరెస్సెస్ వ్యక్తుల ప్రమేయం ఉండదని స్పష్టీకరణ
దేశంలోని సంస్థాగత నిర్మాణంలో కీలకమైనచోట్ల ఆరెస్సెస్-బీజేపీ తమ సొంత వ్యక్తులను జొప్పిస్తోందని, మంత్రులు కూడా తమ తమ మంత్రిత్వ శాఖల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఆరెస్సెస్ వ్యక్తులతో కలిసి పని చేస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.

భారతదేశంలో స్వేచ్ఛకు పునాది రాజ్యాంగమని, లోక్ సభ, రాజ్యసభ, ప్రణాళిక సంఘం, సాయుధ బలగాలు ఇవన్నీ రాజ్యాంగం ద్వారా రూపుదిద్దుకున్నవేనని, అలాంటి వ్యవస్థలలో కీలక పదవుల్లో బీజేపీ, ఆరెస్సెస్ వ్యక్తుల్ని నియమిస్తున్నారని, ప్రభుత్వంలోని ఏ మంత్రి వద్దకైనా వెళ్ళి అడిగితే మా శాఖలో ఆరెస్సెస్ వ్యక్తి చెప్పినట్లు నడుచుకుంటామని సమాధానం వస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఆజ్ తక్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించిన గడ్కరీ... రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. మంత్రులు తీసుకునే నిర్ణయాల్లో ఆరెస్సెస్ వ్యక్తుల ప్రమేయం ఉండదన్నారు.


More Telugu News