ఉల్లి ఎగుమతులపై కేంద్రం భారీ వడ్డన... ధరలకు కళ్లెం వేసేందుకే!
- ఇటీవలి వరకు భగ్గుమన్న టమాటా ధరలు
- ఉల్లి ధరలు కూడా పెరిగే అవకాశముందన్న సూచనలు
- అప్రమత్తమైన కేంద్రం
- డిసెంబరు 31 వరకు వర్తించేలా ఎగుమతి సుంకం పెంపు
దేశంలో ఉల్లి ధరలు పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. ఈ నిబంధన డిసెంబరు 31 వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉల్లి ధరలకు సెప్టెంబరులో రెక్కలొస్తాయన్న కథనాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉల్లిగడ్డలు దేశీయంగా అందుబాటులో ఉంచడం కోసమే ఈ సుంకం విధించామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్ లో వెల్లడించింది. ఈ ఎగుమతి సుంకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
దేశంలో ఇటీవలి వరకు టమాటాల ధర భగ్గుమన్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో టమాటాలు కిలో రూ.250కి పైన ధర పలికాయి. ఇప్పుడు ఉల్లి కూడా అదే దారిలో పయనించే పరిస్థితులు ఉండడంతో, కేంద్రం ఇటీవలే తన నిల్వల నుంచి 3 లక్షల టన్నుల ఉల్లిగడ్డలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.