మంగళగిరి నియోజకవర్గంలో 2,500 కి.మీ పూర్తి చేసుకున్న నారా లోకేశ్ పాదయాత్ర
- మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పునఃప్రారంభం
- తాడేపల్లిలో శిలాఫలకం ఆవిష్కరించిన లోకేశ్
- మంగళగిరి నియోజకవర్గంలో 20 వేల ఇళ్లు నిర్మిస్తామని హామీ
- ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ కు ఘనస్వాగతం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు మంగళగిరి నియోజకవర్గంలో పునఃప్రారంభమైంది. నిన్న ఒక్కరోజు కోర్టు పని కారణంగా పాదయాత్రకు విరామం ఇవ్వగా... ఇవాళ రాజధాని ప్రాంతంలోని చంద్రబాబు నివాసం నుంచి లోకేశ్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.
ఇవాళ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర 2,500 కి.మీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక తాము చేసే పనులను తెలుపుతూ లోకేశ్ తాడేపల్లిలో శిలాఫలకం ఆవిష్కరించారు.
మంగళగిరి నియోజకవర్గంలో 20 వేల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పేదల ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరిస్తామని, అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే భూముల్లోని స్థలాలు క్రమబద్ధీకరిస్తామనే హామీతో శిలాఫలకం ఆవిష్కరించారు.
కాగా, లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ సాయంత్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. టీడీపీ యువనేత రాకతో ప్రకాశం బ్యారేజి జనసంద్రంలా మారింది. లోకేశ్ కు 150కి పైగా పడవలతో స్వాగతం పలికారు.