ఫ్రొఫెషనల్ బైక్ రేసర్ అవతారంలో రాహుల్ గాంధీ
- లడఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ
- బైక్ పై పాంగాంగ్ సరస్సుకు పయనం
- రేపు (ఆగస్టు 20) రాజీవ్ గాంధీ జయంతి
- పాంగాంగ్ సరస్సు వద్ద తండ్రి జయంతి జరుపుకోనున్న రాహుల్
కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బైక్ రేసర్ అవతారం ఎత్తారు. లడఖ్ పర్యటనలో ఉన్న ఆయన భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సుకు కేటీఎం 390 బైక్ పై బయల్దేరారు. ఓ ప్రొఫెషనల్ బైకర్ ఎలాంటి దుస్తులు, ఉపకరణాలు ధరిస్తాడో, రాహుల్ అవన్నీ ధరించి బైక్ రైడింగ్ చేశారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో రాహుల్ బైక్ విహారం అందరినీ విపరీతంగా ఆకర్షించింది.
రేపు (ఆగస్టు 20) దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. తన తండ్రి జయంతిని రాహుల్ గాంధీ పాంగాంగ్ సరస్సు వద్ద నిర్వహించనున్నారు. ఇక్కడి పర్యాటక శిబిరంలో రాహుల్ నేడు బస చేయనున్నారు.
బైక్ రైడింగ్ కు ముందు రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, పాంగాంగ్ సరస్సు రమణీయత గురించి తన తండ్రి చెబుతుండగా విన్నానని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ బైక్ రైడింగ్ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు.