అమెరికా నుంచి వెనక్కి పంపిన విద్యార్థులపై ఆరా తీసిన జగన్

  • 21 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపిన యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు
  • ఈ 21 మందిలో పలువురు తెలుగు విద్యార్థులు
  • బాధిత విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించిన జగన్
అమెరికా నుంచి కొందరు తెలుగు విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. యూఎస్ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొంది, వీసాలను సాధించి, ఎన్నో ఆశలతో అక్కడి ఎయిర్ పోర్టుల్లో ల్యాండ్ అయిన విద్యార్థులకు అక్కడి అధికారులు షాక్ ఇచ్చారు. సరైన డాక్యుమెంట్లు లేవంటూ, సరైన వివరణ కూడా ఇవ్వకుండానే 21 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు డిపోర్ట్ చేశారు. వీరిలో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. వెనక్కి తిరిగొచ్చిన విద్యార్థుల వివరాలను తెలుసుకుని వారి సమస్యను పరిష్కరించాలని సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. బాధిత విద్యార్థుల పూర్తి సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, అవసరమైతే విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు జరపాలని సూచించారు.


More Telugu News