ఏపీలో 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు.. వైసీపీ-టీడీపీ కార్యకర్తల ఘర్షణలతో ఉద్రిక్తం
- ఏలూరు జిల్లా వీరమ్మకుంటలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు
- ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గరుండి మరీ దాడిచేయిస్తున్నారన్న టీడీపీ
- శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోనూ ఉద్రిక్తత
- మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్లు లెక్కించి విజేతల ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు నేడు జరుగుతున్న పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంటలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తలే తమపై దాడికి పాల్పడ్డారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గురుండి దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం వణుదుర్రు పంచాయతీ ఎన్నికల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం బొప్పడంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. కాగా, మధ్యాహం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. రెండు గంటలకు ఓట్లు లెక్కించి విజేతను ప్రకటిస్తారు.