నా 'ఫోర్త్ లయన్' యాప్ నే వీళ్లు దిశా యాప్ గా మార్చారు: చంద్రబాబు
- కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన
- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యాచరణపై ప్రచారం
- అమలాపురంలో మహిళలతో టీడీపీ అధినేత ముఖాముఖి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమలాపురంలో మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యాచరణలో భాగంగా చేపట్టిన ఈ మహిళల ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో మహిళలు చంద్రబాబును పలు ప్రశ్నలు అడిగారు. అందుకు చంద్రబాబు తన ఆలోచనలను వారితో పంచుకున్నారు.
మహిళల ప్రశ్నలు... అభిప్రాయాలపై చంద్రబాబు స్పందన
నీలిమ: ఇంత వయసులో ఇంత ఉత్సాహంగా ఎలా పనిచేస్తున్నారు. మీకు అలసట రాదా?
చంద్రబాబు: ఏ పని అనుకుంటే ఆ పని చేయాలన్న ఆలోచన ముఖ్యం. పనిలో ఆనందం వెతుక్కుంటే ఎప్పుడూ అలసట ఉండదు. రాబోయే రోజుల్లో పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా లక్ష్యం. దాని కోసం ఏంచేయడానికైనా, ఎంతసేపు పనిచేయడానికైనా నేను సిద్ధమే.
రాబోయే 30 ఏళ్లలో భారతదేశం ఎలా ఉంటుంది... నా రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందుతుంది అన్నదే నా ఆలోచన. విజన్ అన్నప్పుడు నన్ను తప్పుపట్టారు. నా ఆలోచనను 420 అన్న వాళ్లు నిజంగా 420లుగా మిగిలిపోయారు. నేను చెప్పింది నమ్మనివారు ఇప్పటికీ అక్కడే ఉండిపోయారు. నమ్మినవారు ఊహించని విధంగా ముందుకెళ్లారు.
చందన-ఉద్యోగిని: మీ విజన్ ను తప్పుపట్టిన వారు ఎందరో. కానీ హైదరాబాద్ చూశాక, అక్కడ మీరు సృష్టించిన వాతావరణంలో పనిచేశాక నా ఆలోచన మారింది
చంద్రబాబు: నా ఆలోచనలతో లబ్ధిపొందిన మీలాంటి వాళ్లు బయ టకు రావడంలేదు. దానివల్ల మోసాలు, అబద్ధాలు త్వరగా ప్రజల్లోకి వెళ్తున్నాయి . వాస్తవం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీలాంటి వాళ్లపైనే ఉంది. సమాజంలో మీరుకూడా భాగమని గుర్తించండి. ఇక్కడున్న మహిళలంతా ఒక్కొక్కరు 10 మందిలో మార్పు తీసుకురావాలి. సోషల్ మీడియాను కూడా సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు విజన్ 2047 అంటున్నా.. దానికోసం పదేళ్లపాటు నాకు సహకరించండి. రాష్ట్రాన్ని దేశంలో నెంబర్-1 గా నిలుపుతాను.
ప్రశ్న: అంగన్ వాడీ కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. చాలా కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. పనిభారం ఎక్కువైందని, పిల్లలకు మంచి ఆహారం అందించలేక పోతున్నామని, జీతాలు సరిగా రావడంలేదని అంగన్ వాడీ సిబ్బంది బాధపడు తున్నారు. పిల్లలకు పెట్టే ఆహారం రుచిచూశాను. చాలా దారుణంగా ఉంది.
చంద్రబాబు: అంగన్ వాడీ సిబ్బంది జీతాలు టీడీపీ ప్రభుత్వమే పెంచింది. జీతాలు పెంచలేదని అడిగిన వాళ్లపై లాఠీఛార్జ్ చేయించారు. నేను ఉన్నప్పుడు అంగన్ వాడీ కేంద్రాల్లోని పిల్లలకు మంచి పౌష్ఠికాహారం అందించాం. గర్భం దాల్చింది మొదలు ప్రసవం వరకు మహిళలకు అన్నిరకాల సాయం అందించాం. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ తో పాటు, ఎన్టీఆర్ బేబీ కిట్లు, శిశు సురక్షా, బాలా మృతం వంటి పథకాలు అందించాం. ప్రభుత్వసొమ్ముతో శ్రీమంతాలు, అన్నప్రాస నలు జరిపించాం.
ఆడబిడ్డలకు రూ.50 వేల పెళ్లికానుక అందించా. 7 ఐటీడీఏల్లో 120 ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేశాం. ఆఖరికి ఆడబిడ్డలకు శానిటరీ న్యాప్ కిన్స్ ఉచితంగా అందించాం. పనిప్రదేశాల్లో వారికి ఇబ్బంది ఉండకూడదని భావించాం.
8, 9, 10 తరగతుల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు అందించాను. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీములు ఏర్పాటు చేశాను. ఫోర్త్ లయన్ యాప్ ప్రవేశపెట్టాను. దాన్ని ఇప్పుడు దిశా యాప్ గా మార్చారు. టీడీపీ ప్రభుత్వం రాగానే అంగన్ వాడీ కేంద్రాలను కచ్చితంగా బలోపేతం చేస్తాం.
ప్రశ్న: ఆక్వారంగంపై ఆధారపడి బతికే వాళ్లే ఈ ప్రాంతంలో ఎక్కువ. ఆ రంగం పై ఆధారపడి మహిళలు తలెత్తుకుని బతికారు. కానీ నేడు ఆక్వారంగంపై విద్యు త్ బిల్లుల భారం ఎక్కువైంది. రాష్ట్రానికి ఆదాయం అందించే గొప్ప రంగం పూర్తిగా నాశనమైంది. వ్యవసాయం కూడా బాగోలేదు.
చంద్రబాబు: ఆక్వా రైతులు, కొబ్బరి రైతులు, వరి పండించే వాళ్లు ఇక్కడ ఎక్కువ. ఆక్వా రైతుల్ని ఈ ప్రభుత్వం మోసగించింది. యూనిట్ విద్యుత్ నేను రూ.2లకు అందిస్తే, రూ.1.50పైసలకు ఇస్తామనిచెప్పి, నాన్ జోన్ పేరుతో రూ.4.50 పైసలకు పెంచారు. నీటి తీరువా ధర పెంచారు. ఫీడ్ ధర విపరీతంగా పెంచారు. ఇవన్నీ పెరగడంతో ఆక్వారంగం వెంటిలేటర్ పైకి చేరింది.
ఈ ముఖ్యమంత్రి ఇస్తున్నదెంత.. తిరిగి తీసుకుంటున్నదెంతో ఆలోచించండి. 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు, పన్నులు పెంచాడు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెరిగా యి. ప్రజల ఇబ్బంది తొలగించే బాధ్యత నాది. టీడీపీ ప్రభుత్వం రాగానే ధరలు తగ్గిస్తాను.
ప్రశ్న: మా డ్వాక్రా సంఘం సొమ్ము రూ.60 లక్షలు ఒకామె కాజేసింది. వైసీపీ నేతలు ఆమెకు అండగా ఉండి కాపాడుతున్నారు. టీడీపీ వాళ్లమని రూ.60 లక్షల సొమ్ము ఇవ్వడంలేదు.
చంద్రబాబు: రూపాయి రూపాయి పోగుచేసుకున్న సొమ్ము, కనక దుర్గ అనే డ్వాక్రా యానిమేటర్ స్వాహా చేసింది. మీకు అండగా ఉంటానమ్మా. దీనిపై సంబంధిత అధికారులకు లేఖ రాస్తాను. మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది.
ప్రశ్న: ఈ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు, కంపెనీలు వెళ్లగొట్టింది. మీరు అధికారంలోకి వచ్చాక అవి తరలిపోకుండా ఏదైనా కొత్త పాలసీ తీసుకొస్తారా?
చంద్రబాబు: సైతాన్, సైకో రాష్ట్రంలో ఉంటే ఎవరైనా రావడానికి భయపడతారు. వీళ్లు చేసే అరాచకాలు, దుర్మార్గాలే అందుకు కారణం. తెలుగుదేశం పార్టీ రాగానే పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి, మన పిల్లలకు మంచి భవిష్యత్ అందిస్తా.