మేం అందిస్తున్న నీరాను బెంజి కారులో వచ్చి తాగుతున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • సిరిసిల్లలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు
  • ఉదయం కష్టపడే నేతన్న సాయంత్రానికి గీతన్నను కలుస్తాడంటూ చమత్కారం
  • దేవుడు తాగే అమృతాన్ని గీతన్న మనకు అందిస్తున్నాడని వెల్లడి
  • సిరిసిల్లలో కేటీఆర్ ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం అని పేర్కొన్న శ్రీనివాస్ గౌడ్
సిరిసిల్లలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కల్లు, నీరా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు తాగే అమృతాన్ని గీతన్న (కల్లు గీత కార్మికుడు) మనకు అందిస్తున్నాడని అభివర్ణించారు. ఉదయం అంతా కష్టపడే నేతన్న (చేనేత కార్మికుడు) సాయంత్రం గీతన్నను కలుస్తాడని చమత్కరించారు. 

కల్లు మంచి ఔషధం అని, తాటి ముంజలలో కాల్షియం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అందించే నీరాను బెంజి కారులో వచ్చి తాగుతున్నారని తెలిపారు. 

గౌడ కులస్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మగౌరవాన్ని ఇచ్చిందని, తెలంగాణ వచ్చాక గౌడ కులస్తులు ఆర్థికంగా బలోపేతం అయ్యారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. మంత్రి కేటీఆర్ కు, సిరిసిల్లకు పేగు బంధం ఉందని వ్యాఖ్యానించారు. ఇక్కడ కేటీఆర్ ఉండడం సిరిసిల్ల ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు.


More Telugu News