చూపు తిప్పుకోనివ్వని డిజైన్.. వివో వీ29ఈ

  • ఫోన్ డిజైన్ ఫొటోలను విడుదల చేసిన వివో
  • రెండు వేరియంట్లలో రానున్న మిడ్ ప్రీమియం ఫోన్
  • ధర రూ.25వేల నుంచి ఉండొచ్చని అంచనాలు
వివో కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లోకి వివో వీ29ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫొటోలను వివో సంస్థ విడుదల చేసింది. స్లిమ్ డిజైన్ తో, కర్వ్ డ్ డిస్ ప్లేతో పింక్ కలర్ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇది కెమెరా ఆధారిత మధ్యశ్రేణి ప్రీమియం స్మార్ట్ ఫోన్. 

ఈ ఫోన్ లో 50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఏర్పాటు చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. అలాగే, వెనుక భాగంలో  మరో కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీ కెమెరా ‘ఐ ఆటో ఫోకస్’ అనే ఫీచర్ తో ఉంటుంది. ఫోకస్ సరిగ్గా సెట్ చేసుకుని, స్పష్టమైన ఫొటోలను ఇస్తుంది. రాత్రి సమయంలోనూ ఫొటోలను స్పష్టంగా తీసుకునే విధంగా డిజైన్ చేశారు.

మొత్తం రెండు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో యూవీ లైట్ కిరణాలు పడినప్పుడు రంగు మారినట్టు అనిపిస్తుంది. వెనుక భాగం సగం మ్యాటే ఫినిష్, సగం గ్లాస్ మాదిరిగా ఉంటుంది. గ్లాస్ భాగం రంగులు మారుతుంటుంది. ఫోన్ స్లీక్ డిజైన్ తో వస్తుంది. ఫోన్ కేవలం 7.57 ఎంఎం మందంతో ఉంటుంది. ఫోన్ లో 6.73 అంగుళాల డిస్ ప్లే, 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ చిప్ సెట్ ఉంటాయి. ఫోన్ ధర రూ.25-30వేల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. బేస్ వేరియంట్ 8జీబీతో మొదలవుతుంది. ఇది కేవలం 4జీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ నెల 28న విడుదల కానుంది.


More Telugu News