ఐపీఎల్ తరహాలో 12 నగరాల్లో ప్రొ కబడ్డీ లీగ్

  • డిసెంబర్ 2 నుంచి పదో సీజన్
  • సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో ఆటగాళ్ల వేలం
  • తొమ్మిది సీజన్లలో మూడుసార్లు విజతగా పాట్నా పైరేట్స్
దేశంలో ఐపీఎల్ తర్వాత ఆ స్థాయి ఆదరణ దక్కించుకున్న టోర్నీ ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌). గత తొమ్మిది సీజన్లలో ఈ లీగ్ చాలా ఉత్సాహంగా సాగింది. అయితే, కరోనా కారణంగా రెండేళ్లు గా మెగా లీగ్ ను పరిమిత వేదికల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే పదో సీజన్ ను తిరిగి ఐపీఎల్ మాదిరిగా పోటీలో ఉన్న 12 జట్లకు చెందిన నగరాల్లో నిర్వహించాలని ఆర్గనైజర్స్ నిర్ణయించారు. 

పీకేఎల్‌ పదో సీజన్‌ను డిసెంబర్‌ 2 నుంచి ప్రారంభించనున్నట్లు లీగ్‌ కమిషనర్‌ అనుపమ్‌ గోస్వామి వెల్లడించారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్‌ విడుదల చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో పీకేఎల్ వేలం జరుగుతుందని తెలిపారు. గత తొమ్మిది సీజన్లు విజయవంతమయ్యాయని, పదో సీజన్ అందరికీ గుర్తుండిపోయేలా ఉండబోతోందన్నారు. ఇప్పటిదాకా జరిగిన తొమ్మిది సీజన్లలో పాట్నా పైరేట్స్ మూడు టైటిల్స్ గెలిచి అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.


More Telugu News