ఫోన్లో మాట్లాడుతూనే సీఎంకు సెల్యూట్.. ఏఎస్పీపై బదిలీ వేటు
- వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి
- ఏఎస్పీ వీడియో వైరల్ కావడంతో తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు
- ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు
ఫోన్లో మాట్లాడుతూనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి సెల్యూట్ చేసిన ఓ పోలీసు అధికారిపై బదిలీవేటు పడింది. కోట్‌ద్వార్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి సందర్శించారు. హెలికాప్టర్‌లో దిగిన సీఎంకు కోట్‌ద్వార్ ఏఎస్పీ శేఖర్ సుయాల్ ఫోన్లో మాట్లాడుతూనే సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఏస్పీని నరేంద్రనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీ చేశారు.
ఆగస్టు 11న గ్రస్తన్‌గంజ్ హెలిప్యాడ్ వద్ద ఈ ఘటన జరిగింది. హరిద్వార్ నుంచి హెలికాప్టర్‌లో సీఎం వస్తున్నారన్న సమాచారంతో స్థానిక అధికారులు ఆయనను రిసీవ్ చేసుకునేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏఎస్పీ ఓ చేత్తో చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని మరో చేత్తో సీఎంకు సెల్యూట్ చేశారు. బదిలీ అయిన శేఖర్ సుయాల్ స్థానంలో జే బలునిని కోట్‌ద్వార్ కొత్త ఏఎస్పీగా నియమించారు.