అమెరికా, చైనా ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • చైనా ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాలు
  • 388 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 99 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టపోయాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు, చైనా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 388 పాయింట్లు కోల్పోయి 65,151కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 19,365 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (2.10%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.19%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.53%), టెక్ మహీంద్రా (0.43%), యాక్సిస్ బ్యాంక్ (0.35%). 

టాప్ లూజర్స్:
ఐటీసీ (-2.04%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.67%), రిలయన్స్ (-1.44%), ఎల్ అండ్ టీ (-1.40%), నెస్లే ఇండియా (-1.22%).   



More Telugu News