వైజాగ్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఏకంగా 25 ఎకరాల్లో నిర్మాణం!
- స్టేడియంతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం
- శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్
- నగరంలో ఇప్పటికే ఉన్న ఓ అంతర్జాతీయ స్టేడియం
ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ అభిమానులకు శుభవార్త. విశాఖపట్నంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతోంది. వైజాగ్ లో కొత్త స్టేడియంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. 25 ఎకరాల్లో స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మిస్తారు. ఇక ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వివిధ రకాల ఆటల నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వనుంది. రాబోయే 3–4 నెలల్లో కొత్త స్టేడియానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వైజాగ్ లో ఇప్పటికే వైఎస్ ఆర్ క్రికెట్ స్టేడియం ఉంది. ఇది దేశవాళీ మ్యాచ్ లతో పాటు అంతర్జాతీయ మ్యాచ్ లకూ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పుడు కొత్త స్టేడియం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు? నిర్మాణ వ్యయం ఎంత? అనేదానిపై వివరాలు తెలియాల్సి ఉంది.