క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టి, మైదానంలో సిక్సర్ల మోత మోగిస్తున్న పంత్
- ఈ ఏడాది ఆరంభంలో కారు ప్రమాదానికి గురైన
రిషబ్ పంత్ - తీవ్ర గాయాలతో కొన్ని నెలలుగా ఆటకు దూరం
- పూర్తిగా కోలుకొని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వికెట్ కీపర్
ఈ ఏడాది ఆరంభంలో ఘోర కారు ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడు. చాన్నాళ్ల తర్వాత బ్యాట్ పట్టి మళ్లీ మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో శిక్షణ తీసుకుంటున్న పంత్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్ లో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు.
తన మార్కు ఫ్లిక్ షాట్ తో బంతిని సిక్స్ కొట్టడంతో అక్కడి అభిమానులు కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు ప్రమాదంలో పంత్ ఎడమ మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ మ్యాచ్ లో అతను బ్యాటింగ్ చేసిన తీరు చూస్తుంటే గాయం నుంచి దాదాపుగా కోలుకున్నట్లుగానే కనిపించింది. ఇక ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా ఎన్‌సీఏకు వచ్చిన పేసర్ మహ్మద్ సిరాజ్.. పంత్ ను కలిశాడు. అతనితో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.