గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాల తొలగింపు.. దేవినేని ఉమా గృహ నిర్బంధం

  • నందిగామలో గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించిన అధికారులు
  • అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదన్న ఉమా
  • అభివృద్ధి పనులకు వైఎస్సార్ విగ్రహం అడ్డు కాదా? అని ప్రశ్న
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ విగ్రహాల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నందిగామకు బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు రావద్దంటూ హౌస్ అరెస్ట్ చేశారు. 

ఈ నేపథ్యంలో దేవినేని ఉమా మాట్లాడుతూ... కొంత మంది అధికారులు వైసీపీ నేతల చెప్పుచేతుల్లో పని చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతీయ నేతల విగ్రహాలను తొలగించిన అధికారులు అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదని మండిపడ్డారు. అభివృద్ధి పనులకు అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహం అడ్డు కాదా? అని ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం అని అధికారులను ప్రశ్నించారు.


More Telugu News