స్వాతంత్ర్య దినోత్సవాన అశ్లీల పాటలకు చిందేసిన బీహార్ పోలీసులు
- త్రివర్ణ పతాకం కిందే పురుష, మహిళా పోలీసుల చిందులు
- వీడియో బయటకు రావడంతో వైరల్ చేసిన వ్యక్తి కోసం గాలింపు
- విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
స్వాతంత్ర్య దినోత్సవాన బీహార్ పోలీసులు అశ్లీల భోజ్పురి పాటలకు డ్యాన్సులు చేస్తూ రచ్చ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బక్సర్ జిల్లాలో యూనిఫాంలో ఉన్న ఫైర్ బ్రిగేడ్ పోలీసులు జెండా వందనం అనంతరం అక్కడే మహిళా, పురుష పోలీసులు డ్యాన్సులు వేస్తూ, పాడుతూ ఎంజాయ్ చేశారు. కొందరు ఆ డ్యాన్సులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
వీడియో బయటకు రావడంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. ఆ వీడియోను వైరల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఫైర్ బ్రిగేడ్ కార్యాలయంలోనే ఈ ఘటన జరగడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.