చనిపోయిన వారి చికిత్సకు రూ. 7 కోట్లు ఖర్చు చేశారు.. కాగ్ నివేదిక
- పీఎంజేఏవై పథకంలో అక్రమాలు
- చనిపోయిన 3,446 మందికి చికిత్స
- క్లెయిమ్‌ల పరిశీలనలో వెలుగులోకి
- కేరళ, ఛత్తీస్‌గఢ్, హర్యానా రాష్ట్రాల్లో ఘటనలు
చనిపోయిన వారికి వైద్యం చేయడాన్ని ‘ఠాగూర్’ వంటి సినిమాల్లో చూసుంటారు. కానీ నిజంగానే జరిగింది. చనిపోయిన వారికి వైద్యం కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కింద ఏకంగా రూ. 6.97 కోట్లు ఖర్చు చేశారు. కాగ్ ఆడిట్‌లో ఇది వెల్లడైంది. ఈ పథకం కింద గతంలో చనిపోయిన 3,446 మంది రోగుల చికిత్సకు ఈ మొత్తాన్ని ఉపయోగించినట్టు కాగ్ నివేదిక పేర్కొంది.
చికిత్స పొందినట్టుగా ఆసుపత్రులు సమర్పించిన క్లెయిమ్ రిపోర్టులు పరిశీలిస్తే వారంతా గతంలోనే చనిపోయినట్టు తేలిందని తెలిపింది. ఇలాంటి క్లెయిముల్లో అత్యధికంగా కేరళ నుంచి రాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఛత్తీస్‌గఢ్, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి.
ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవైకి ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ స్కీంగా పేరుంది. 12 కోట్ల మంది పేద, బలహీన కుటుంబాలకు (దాదాపు 55 కోట్ల మంది లబ్ధిదారులు) ద్వితీయ, తృతీయ సంరక్షణ ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య రక్షణను ఈ పథకంలో అందిస్తారు.