ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలను నిర్వహిస్తే తెలంగాణలో ఏయే పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..!: టైమ్స్ నౌ సర్వే
- బీఆర్ఎస్ కు 9 నుంచి 11 సీట్లు వస్తాయన్న సర్వే
- కాంగ్రెస్ కు 3 నుంచి 4 స్థానాలు వస్తాయని వెల్లడి
- బీజేపీ 2 నుంచి 3 సీట్లు గెలుచుకుంటుందన్న సర్వే
లోక్ సభ ఎన్నికలకు దేశంలోని అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలను నిర్వహిస్తే ఫలితాల సరళి ఎలా ఉండబోతోందో తన సర్వేలో టైమ్స్ నౌ వెల్లడించింది. తెలంగాణ విషయానికి వస్తే అధికార బీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యతను నిలబెట్టుకుంటుందని సర్వే తెలిపింది.
మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను బీఆర్ఎస్ 9 నుంచి 11 సీట్లను గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 4 స్థానాలు వస్తాయని తెలిపింది. బీజేపీకి 2 నుంచి 3 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తుందని తెలిపింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 9, బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3 సీట్లు రాగా... ఎంఐఎం ఒక స్థానంలో గెలిచింది.