మళ్లీ భారత మార్కెట్లోకి ఆనర్.. నయా మోడల్స్‌తో ఎంట్రీ
- మూడేళ్ల క్రితం నోయిడా కంపెనీ పీఎస్‌ఏవీతో పంపిణీ కోసం ఒప్పందం
- ఆనర్ 90ని లాంచ్ చేయబోతున్నట్టు వార్తలు
- ఎండ్రీని కన్ఫామ్ చేసిన ఆనర్
- అదిరిపోయే ఫీచర్స్‌తో చైనాలో లాంచ్ అయిన ‘ఆనర్ 90’
చైనీస్ మొబైల్ మేకర్ ఆనర్ మళ్లీ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. కొత్త మోడళ్లతో దూసుకొస్తోంది. నోయిడాకు చెందిన పీఎస్ఏవీ గ్లోబల్‌తో ఆనర్ మూడేళ్ల క్రితం పంపిణీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత ఇన్నాళ్లు మార్కెట్లో తిరిగి అడుగుపెడుతున్నట్టు కంపెనీ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో టీజ్ చేసింది. చైనీస్ మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన ఆనర్ 90ని భారత్‌లో ఆవిష్కరించబోతున్నట్టు తెలుస్తున్నా కంపెనీ మాత్రం హ్యాండ్‌సెట్‌కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, నివేదికలు మాత్రం ఆనర్ 90ని వచ్చే నెలలో ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు చెబుతున్నాయి.
ఆనర్ 90 స్పెసిఫికేషన్లు
చైనాలో ఈ ఏడాది మొదట్లో ఆనర్ 90తోపాటు 90 ప్రొను విడుదల చేశారు. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో ఏకంగా 16జీబీ ర్యామ్ ఉంది. 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ ఓలెడ్ డిస్‌ప్లే, 12 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 200 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, సెల్ఫీల కోసం 50 మెగాపిక్సల్ కెమెరా, 512 జీబీ అంతర్గత మెమరీ, 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.1, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తోంది. ధర వివరాలు తెలియాల్సి ఉంది.