ఆసియా క్రీడలకు దూరమైన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్
- తన మోకాలికి గాయమయిందని వెల్లడించిన ఫొగాట్
- ప్రాక్టీస్ చేస్తుండగా గాయమయిందని వెల్లడి
- ఈ నెల 17న ముంబైలో సర్జరీ చేయించుకోబోతున్నానన్న స్టార్ రెజ్లర్
భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడల పోటీల నుంచి వైదొలగింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించింది. రెండు రోజుల క్రితం 13వ తేదీన ప్రాక్టీస్ చేస్తుండగా తన ఎడమ మోకాలికి గాయమయిందని ఆమె తెలిపింది. వెంటనే వైద్యులను సంప్రదిస్తే స్కానింగ్ చేశారని... సర్జరీ చేయడం ఒక్కటే మార్గమని వైద్యులు సూచించారని చెప్పింది. దీంతో ఈ నెల 17న ముంబైలో సర్జరీ చేయించుకోబోతున్నానని తెలిపింది.
2018లో జకార్తాలో జరిగిన ఏసియన్ గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించానని, ఈ సారి కూడా గోల్డ్ మెడల్ సాధించాలని కలలు కన్నానని, కానీ గాయం కారణంగా పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయానని ఫొగాట్ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు గాయమైన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశానని, దీంతో తన బదులుగా రిజర్వ్ ఆటగాళ్లను పోటీలకు పంపేందుకు వీలుంటుందని చెప్పారు. మీ అందరి మద్దతుతో 2024లో జరగబోయే పారిస్ ఒలింపిక్స్ కు సిద్ధమవుతానని తెలిపింది.