టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు.. ఎందుకంటే..!
- నాగర్ కర్నూలులో పోలీసులపై మాట్లాడిన టీపీసీసీ చీఫ్
- అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ ఫిర్యాదు
- రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన నల్గొండ పోలీస్ అసోసియేషన్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం పోలీస్ కేసు నమోదయింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ పట్వారి ఫిర్యాదు చేయడంతో టీపీసీసీ చీఫ్‌పై ఐపీసీ 153, 504 సెక్షన్ల కింద కేసు నమోదయింది.
రేవంత్ రెడ్డి సోమవారం నాగర్ కర్నూలులో మాట్లాడుతూ... అధికారులు ముఖ్యంగా పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్‌కు వత్తాసు పలికిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి జాబితాను సిద్ధం చేస్తున్నామని, వారిని గుడ్డలూడదీసి కొడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు.
రేవంత్ చేసిన వ్యాఖ్యలను నల్గొండ పోలీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. రేవంత్ వ్యాఖ్యలు దురదృష్టకరమని అసోసియేషన్ అధ్యక్షుడు జయరాజు, కార్యదర్శి సోమయ్య అన్నారు. ఎవరైనా సరే పోలీస్ శాఖ, అధికారులు, ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసుల గుడ్డలు ఊడదీసి కొడతా, డైరీలో పోలీసుల పేర్లు రాసుకుని పెట్టుకున్న.. లాంటి వ్యాఖ్యలు పోలీసు అధికారుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. తాము బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.