'సులభ్ ఇంటర్నేషనల్' బిందేశ్వర్ పాఠక్ మృతి

  • ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసిన పాఠక్
  • 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు
  • రైల్ మిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బిందేశ్వర్ పాఠక్
  • పద్మభూషణ్ సహా పలు అవార్డులు గెలుచుకున్న పాఠక్
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ (80) మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన పరిశుభ్రత, సామాజిక సంస్కరణోద్యమ వ్యవస్థాపకుడు. బహిరంగ మలమూత్ర విసర్జనకు వ్యతిరేకంగా పోరాడారు. కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి కృషి చేశారు. బిందేశ్వర్ పాఠక్‌కు చెందిన సులభ్ ఇంటర్నేషనల్ దేశవ్యాప్తంగా 1.3 మిలియన్ల హౌస్ హోల్డ్ టాయిలెట్లు, 54 మిలియన్ ప్రభుత్వ టాయిలెట్లను సరికొత్తగా నిర్మించింది. 

పాఠక్ 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు 50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్ మిషన్‌కు బిందేశ్వర్ పాఠక్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈయన పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. భారత మూడో అతిపెద్ద అవార్డ్ పద్మ భూషణ్‌ను అందుకున్నారు. ఏప్రిల్ 14ను బిందేశ్వర్ పాఠక్‌ డేగా న్యూయార్క్ సిటీ ప్రకటించడం గమనార్హం.


More Telugu News