మా పథకాలను నీతి ఆయోగ్ కూడా అభినందించింది: కేటీఆర్

  • రైతన్నల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న కేటీఆర్
  • దేశంలో ఇలాంటి పథకాలు ఎక్కడా లేవని వెల్లడి
  • పారిశుద్ధ్యంలో ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందన్న మంత్రి
హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ ఘనతలను వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు  చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటలూ కరెంటు అందిస్తున్నామని తెలిపారు. 

కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా గురుకులాలు ఏర్పాటు చేశామని, గురుకులాల్లో చదివే విద్యార్థుల్లో ఒక్కొక్కరిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నీతిఆయోగ్ కూడా అభినందించిందని కేటీఆర్ వివరించారు. 

తెలంగాణ మున్సిపాలిటీలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 సర్వేలో పారిశుద్ధ్యంలో ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని కేటీఆర్ గర్వంగా చెప్పారు.


More Telugu News