తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
- నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.5.67 కోట్లు
- చాన్నాళ్ల తర్వాత ఈ స్థాయిలో ఆదాయం
- గత నెలలోనూ పలుమార్లు రూ.5 కోట్లకు పైగా హుండీ ఆదాయం
- నిన్న స్వామివారిని దర్శించుకున్న 74 వేల మంది భక్తులు
కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఇటీవల కాలంలో హుండీ ద్వారా భారీ ఆదాయం లభిస్తోంది. నిన్న (ఆగస్టు 14) ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.5.67 కోట్లు హుండీ ద్వారా లభించాయి. చాన్నాళ్ల తర్వాత తిరుమల శ్రీవారికి ఆ స్థాయిలో ఆదాయం వచ్చింది. గత నెలలోనూ సోమవారాల్లో స్వామివారి హుండీ ఆదాయం రూ.5 కోట్లకు పైనే నమోదైంది.
కాగా, నిన్న తిరుమల వెంకన్నను 74,617 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,752 మంది తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. ఇవాళ కూడా తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది.
స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది .