ఓలా నుంచి రెండు కొత్త స్కూటర్లు.. ధర రూ.లక్షలోపే
- ఓలా ఎస్1ఎక్స్, ఎస్1ఎక్స్ ప్లస్ విడుదల
- ఎస్1ఎక్స్ లో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు
- వీటి ధరలు రూ.79,999 నుంచి ప్రారంభం
- ఎస్1ఎక్స్ ప్లస్ ఆరంభ ధర రూ.99,999
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఓలా మరింత దూకుడుని ప్రదర్శిస్తోంది. రూ.లక్ష లోపే కొత్త స్కూటర్లను తీసుకొచ్చింది. స్వాతంత్య్ర దినాన ఓలా రెండు కొత్త స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. విశేషం ఏమిటంటే, ఈ రెండింటి ధరలు కూడా రూ. లక్షలోపే ఉన్నాయి. ఈ నెల 21 తర్వాత ధరల్లో మార్పు ఉంటుంది.
ఓలా ఎస్1ఎక్స్ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. 3 కిలోవాట్ హవర్ బ్యాటరీ కావాలంటే ఎక్స్ షోరూమ్ ధర రూ.89,999. ఇది కూడా ఈ నెల 21 వరకే ఈ ధర అమల్లో ఉంటుంది. ఆ తర్వాత దీని ధర రూ.99,999కు పెరుగుతుంది. ఇక 2 కిలోవాట్ హవర్ బ్యాటరీ ప్యాక్ తో కూడిన ఎస్1 ఎక్స్ తీసుకుంటే ఎక్స్ షోరూమ్ ధర రూ.79,999. ఆగస్ట్ 21 వరకు ఈ ధర అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రూ.89,999కు పెరుగుతుంది. బుక్ చేసుకుంటే వీటిని డిసెంబర్ నుంచి డెలివరీ చేస్తారు.
ఓలా ఎస్1ఎక్స్ ప్లస్ అనేది రెండో మోడల్. ఇందులో 3 కిలోవాట్ హవర్ బ్యాటరీ ప్యాక్ ధర ఈ నెల 21 వరకు రూ.99,999. ఆ తర్వాత రూ.1,09,999గా ఉంటుంది. వీటి డెలివరీలు సెప్టెంబర్ నుంచే మొదలవుతాయి. ఇందులో 3 కిలోవాట్ హవర్ బ్యాటరీ ఒక్కసారి చార్జ్ తో 151 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఎస్ 1ఎక్స్ ప్లస్ లో గరిష్ట వేగం 90 కిలోమీటర్లు. బూట్ స్పేస్ 34 లీటర్లుగా ఉంది. ఎక్స్ షోరూమ్ ధరకు అదనంగా రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయి.