హిందీలోనూ విడుదల కానున్న చిరంజీవి 'భోళా శంకర్'
- చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్
- ఆగస్టు 11న విడుదల
- నెగెటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం
- హిందీ వెర్షన్ ఈ నెల 25న రిలీజ్
- తాజాగా హిందీ టీజర్ వీడియో విడుదల
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ చిత్రం ఈ నెల 11న తెలుగులో రిలీజైంది. అయితే ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి, మెగా స్థాయిలో లేదన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ భోళా శంకర్ హిందీలోనూ ప్రేక్షకుల ముందుకు వెళ్లనుంది.
ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో ఆర్కేడీ స్టూడియోస్ విడుదల చేయనుంది. ఆగస్టు 25న భోళా శంకర్ హిందీ వెర్షన్ థియేటర్లలోకి వస్తోందని ఆర్కేడీ స్టూడియోస్ తాజాగా ఓ టీజర్ వీడియోను విడుదల చేసింది. కాగా, చిరంజీవికి బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తోంది.
భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటించగా, చిరంజీవి చెల్లెలి పాత్రను కీర్తి సురేశ్ పోషించింది. సుశాంత్, మురళీశర్మ, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.