ఏపీ హైకోర్టులో దేవినేని ఉమ, నల్లారి కిశోర్ లకు ఊరట

  • ఇటీవల పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు
  • టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిశోర్ లపై కేసులు
  • ముందస్తు బెయిల్ కోసం టీడీపీ నేతల పిటిషన్లు
  • నేడు విచారణ కొనసాగించిన ఏపీ హైకోర్టు
  • ఈ నెల 16 వరకు ఉమ, కిశోర్ లను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు
ఇటీవల పుంగనూరులో జరిగిన ఘటనల నేపథ్యంలో, టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిశోర్ లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

ఉమ, కిశోర్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దేవినేని ఉమ, నల్లారి కిశోర్ లను సోమవారం వరకు అరెస్ట్ చేయబోమని స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ల వాదనలు వినేందుకు తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అప్పటివరకు దేవినేని ఉమ, నల్లారి కిశోర్ లను అరెస్ట్ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


More Telugu News