దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని మోదీ నివాళి

  • 1947 అగస్ట్ 14న విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినవారిని గుర్తు చేసుకున్న ప్రధాని
  • వలసబాట పట్టిన వారి కష్టాలను, పోరాటాన్ని ఈ రోజు గుర్తు చేస్తుందని వెల్లడి
  • 2021 నుండి అగస్ట్ 14ను దేశ విభజన గాయాల స్మారక దినంగా పాటిస్తున్న ప్రభుత్వం
దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నివాళులు అర్పించారు. 1947 అగస్ట్ 14న విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆ భయానక సమయంలో లక్షలాదిమంది మృతి చెందారని, వారిని గుర్తుంచుకోవాల్సిన సమయమన్నారు.

వలసబాట పట్టిన వారి కష్టాలను, పోరాటాన్ని ఈరోజు గుర్తుచేస్తోందన్నారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, అగస్ట్ 14ను దేశ విభజన గాయాల స్మారక దినంగా పాటిస్తామని ప్రధాని మోదీ 2021లో ప్రకటించారు.


More Telugu News