త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తమ్ముడు
- రేపటి ఇండిపెండెన్స్ డేకు సిద్ధమవుతున్న యావత్ దేశం
- కశ్మీర్ లోని సోపోర్ లో జాతీయ జెండాను ఎగుర వేసిన రయీస్
- తన సోదరుడు కూడా తిరిగి రావాలని కోరుకుంటున్నానన్న రయీస్
యావత్ దేశం రేపటి స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమవుతోంది. మరోవైపు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది జావెద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టూ జమ్మూకశ్మీర్ లోని సోపోర్ లో తన నివాసం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత పౌరులుగా తాము ఎంతో గర్వపడతామని, ఎప్పటికీ భారతీయులుగా ఉంటామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంకోవైపు కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు గాలిస్తున్న టాప్ టెన్ ఉగ్రవాదుల జాబితాలో జావెద్ మట్టూ కూడా ఉన్నాడు.
కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తన సోదరుడు కూడా తాను ఎంచుకున్న మార్గాన్ని వదిలి వెనక్కి రావాలని రయీస్ కోరాడు. ఎంతో భావోద్వేగంతో తాను జెండాను ఎగురవేస్తున్నానని చెప్పాడు. 2009లో తన సోదరుడు ఉగ్రవాదం వైపు వెళ్లిపోయాడని, అప్పటి నుంచి ఆయన తిరిగి రాలేదని, ఒకవేళ ఆయన బతికుంటే తిరిగి రావాలని కోరుకుంటున్నానని అన్నాడు. పాకిస్థాన్ శక్తిహీనం అయిందని... తాము నిజమైన భారతీయులుగా తమ మాతృభూమిలోనే నివసిస్తామని చెప్పాడు.