అందరూ ముందుకు వెళ్లాలనుకుంటే... ఇతడు వెనక్కి వెళ్లాలనుకునే వ్యక్తి: పవన్ పై మంత్రి కారుమూరి వ్యాఖ్యలు
- నిన్న గాజువాకలో సీఎం జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు
- పవన్ కు మతిపోయినట్టుందన్న మంత్రి కారుమూరి
- పవన్ కు సభ్యత, సంస్కారం లేవని విమర్శలు
- సీఎంను ఏకవచనంలో సంబోధిస్తున్నాడని ఆగ్రహం
గాజువాక సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. అందరూ ముందుకు వెళ్లాలనుకుంటే, ఇతడు వెనక్కి వెళ్లాలనుకునే వ్యక్తి అని పవన్ ను విమర్శించారు. చూస్తుంటే పవన్ కల్యాణ్ కు మతిపోయినట్టుందని, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని అన్నారు.
సీఎం జగన్ రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్నారని, అలాంటి వ్యక్తిని పవన్ ఏకవచనంతో సంబోధించడం సరికాదని మంత్రి కారుమూరి హితవు పలికారు. పవన్ కల్యాణ్ కు సభ్యత, సంస్కారం ఉన్నాయా? అని ప్రశ్నించారు. వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చడం పవన్ అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సీఎం అవ్వాలన్న ఆలోచన లేని పవన్... చంద్రబాబుకు ప్యాకేజి స్టార్ గానే మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. పవన్, చంద్రబాబు వంటి వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మంత్రి కారుమూరి చిత్తూరు జిల్లా పుంగనూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.