రికార్డు డబుల్ సెంచరీ తర్వాత మరో శతకంతో దుమ్మురేపిన పృథ్వీ షా
- భారత జట్టుకు దూరమైన యువ ఓపెనర్
- ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో రాణిస్తున్న పృథ్వీ
- వన్డే కప్‌లో వరుసగా రెండో శతకం నమోదు
ఫామ్, ఫిట్ నెస్ కోల్పోయి భారత జట్టుకు దూరమైన యువ ఆటగాడు పృథ్వీ షా కౌంటీ క్రికెట్‌లో శతకాల మోత మోగిస్తున్నాడు. మూడు రోజుల కిందట వన్డే మ్యాచ్ లో రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగిన అతను నార్తంప్టన్ షైర్ తరఫున మరో శతకంతో మెరిశాడు. ఇంగ్లండ్ వన్డే కప్ లో భాగంగా డర్హమ్ జట్టుతో నిన్న జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ 76 బంతుల్లోనే 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో అజేయంగా 125 పరుగులు చేశాడు.
దాంతో, ఈ మ్యాచ్ లో నార్తంప్టన్‌షైర్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన డర్హమ్ 43.2 ఓవర్లలో 198 రన్స్ కు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో పృథ్వీ షా మెరుపులతో నార్తంప్టన్‌షైర్ 25.4 ఓవర్లలో 204/4 స్కోరు చేసి సులువుగా నెగ్గింది. గత మ్యాచ్ లో పృథ్వీ షా 153 బంతుల్లోనే 244 పరుగులు సాధించాడు.