'బీస్ట్' విమర్శల నుంచి బయటపడిన 'జైలర్' డైరెక్టర్!
- మంచి స్క్రీన్ ప్లే తెలిసిన దర్శకుడిగా నెల్సన్ కి పేరు
- కానీ 'బీస్ట్' సినిమాతో తప్పని విమర్శలు
- అవేమీ పట్టించుకోకుండా ఛాన్స్ ఇచ్చిన రజనీ
- ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్న నెల్సన్
కోలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఇద్దరు దర్శకుల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి. ఒకరు లోకేశ్ కనగరాజ్ అయితే, మరొకరు నెల్సన్ దిలీప్ కుమార్. లోకేశ్ కనగరాజ్ ఒకటి తరువాత ఒకటిగా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ వెళుతున్నాడు. ఇక నెల్సన్ కథలను రెడీ చేసుకునే తీరు .. స్క్రీన్ ప్లేను వేసే తీరు ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే వచ్చింది. నయనతారతో ఆయన చేసిన 'కొలమావు కోకిల' (తెలుగులో 'కో కో కోకిల') చాలా చిన్న బడ్జెట్ లో చేసిన సినిమా .. కానీ తమిళంలో అది సూపర్ హిట్.
ఇక ఆ తరువాత శివకార్తికేయన్ తో నెల్సన్ చేసిన 'డాక్టర్' .. హీరో కెరియర్ లో తొలి 100 కోట్ల సినిమా. ఆయన టాలెంట్ ను గుర్తించే విజయ్ అతనికి ' బీస్ట్' సినిమా ఛాన్స్ ఇచ్చాడు. హీరో - హీరోయిన్, మరి కొన్ని ప్రధానమైన పాత్రలు ఒక షాపింగ్ మాల్ లో ఉండగా ఉగ్రవాదులు లోపలికి చొరబడతారు. లోపల ఉన్న అందరినీ బందీలుగా చేస్తారు. అక్కడి నుంచి ఈ కథ అంతా కూడా ఒక షాపింగ్ మాల్ చుట్టూనే తిరుగుతుంది.
ఈ సినిమా సక్సెస్ ను సాధించింది .. అయితే అది విజయ్ రేంజ్ కి తగిన సక్సెస్ కాదనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేశారు. ఆ సినిమా విజయ్ క్రేజ్ వలన మాత్రమే నడిచిందని ఆయన తండ్రి చేసిన కామెంట్స్ అప్పట్లో మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా సన్ పిక్చర్స్ వారు మళ్లీ ఆయనకి అవకాశం ఇవ్వడం .. రజనీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. వాళ్ల నమ్మకాన్ని నెల్సన్ నిలబెట్టుకున్నాడు. 'బీస్ట్'తో వెంటాడిన విమర్శలకు, 'జైలర్' హిట్ తో ఫుల్ స్టాప్ పెట్టేశాడు.