'జైలర్' మూవీ మండే టాక్
- ఈ నెల 10వ తేదీన విడుదలైన 'జైలర్'
- బలమైన కంటెంట్ తో మెప్పించిన సినిమా
- రజనీ కెరియర్లో ఇది మరో బ్లాక్ బస్టర్
- వీకెండ్ తరువాత కూడా తగ్గని వసూళ్ల జోరు
రజనీకాంత్ చేసిన 'జైలర్' సినిమా ఈ నెల 10వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలైంది. సన్ పిక్చర్స్ వారి నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. తొలి ఆటతోనే ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా కూడా రజనీ బ్లాక్ బస్టర్స్ లో ఇది ఒకటిగా చెబుతున్నారు.
ఓపెనింగ్స్ విషయంలోనే కొత్త రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా, ఆ తరువాత అదే స్థాయిలో వసూళ్లను కొనసాగిస్తూ వెళుతోంది. వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా అదే రేంజ్ లో దూసుకుపోతోంది. 'జైలర్'గా రజనీ పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆయన స్టైల్ .. కథ .. స్క్రీన్ ప్లే .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయని అంటున్నారు.
కుటుంబమే మనిషి బలం .. బలహీనత. ఆ కుటుంబం కారణంగానే ఏ యజమాని అయినా గొడవలకు .. వివాదాలకు దూరంగా ఉంటాడు. కానీ ఆ కుటుంబమే ప్రమాదంలో పడుతున్నప్పుడు ఒక నిజాయతీపరుడైన మాజీ 'జైలర్' ఏం చేస్తాడు? తన కుటుంబం కారణంగానే సమాజానికి ప్రమాదం ఏర్పడనుందని తెలిసినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేదే కథ. ఈ కంటెంట్ లో ఉన్న ఎమోషన్ కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ కావడమే ఇంతటి విజయానికి కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.