రేపు స్ట్రీమింగ్ కానున్న 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'
- జులై 21న విడుదలైన 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'
- గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ
- థియేటర్ల నుంచి లభించని ఆదరణ
- 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్
గ్రామీణ నేపథ్యంలో సాగే మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాగా 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' కనిపిస్తుంది. యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాకి, చందూ ముద్దు దర్శకత్వం వహించాడు. చైతన్యరావు - లావణ్య జంటగా నటించిన ఈ సినిమా, జులై 21వ తేదీన విడుదలైంది.
అలాంటి ఈ సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్స్ ను కూడా 'ఈటీవీ విన్' నుంచి వదిలారు. కథ విషయానికొస్తే .. ఇది 'కపిలేశ్వరపురం' నేపథ్యంలో నడుస్తుంది. గ్రామీణ జీవితం .. గోదావరి అందాలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. హీరో - హీరోయిన్ ప్రేమ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే కథ.
పోస్టర్స్ .. సినిమా చూస్తున్నప్పుడు జంధ్యాల మార్కు సినిమాలా అనిపిస్తుంది. దర్శకుడు చాలా వరకూ సహజత్వానికి పెద్దపీట వేశాడు. కానీ ఈ సినిమా థియేటర్ల నుంచి ఆశించినస్థాయి ఆదరణ పొందలేకపోయింది. మరి ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు కొడుతుందనేది చూడాలి.