'జైలర్'లో ఈ కామెడీ సీన్ హైలైట్!
- ఈ నెల 10వ తేదీన విడుదలైన 'జైలర్'
- డిఫరెంట్ గా డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్
- రజనీ .. యోగిబాబు కామెడీ హైలైట్
- థియేటర్స్ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్
రజనీకాంత్ 'జైలర్' సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచి ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. రజనీ స్టైల్ కీ .. ఆయన క్రేజ్ కి తగిన కంటెంట్ ఇది. యాక్షన్ సీన్స్ లో రజనీ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆడియన్స్ గెస్ చేయలేరు. అలా డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. ఇక అదే స్థాయిలో సింపుల్ గా కనిపిస్తూనే .. అనిపిస్తూనే కామెడీ కూడా ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా ఆరంభంలో రజనీకాంత్ కాస్త అమాయకంగా .. మంచివాడిగా కనిపిస్తూ ఉంటాడు. దాంతో యోగిబాబు అతణ్ణి కాస్త భయపెడుతూ .. ఆటపట్టిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. 'పెద్దోళ్లు ఓ మాట చెప్పారు' అనేది ఆయన మేనరిజం. 'పెద్దోళ్లు ఓ మాట చెప్పారు' అంటూ తనకి తోచిన మాట .. అనుకూలమైన మాట చెబుతూ ఉంటాడు. రజనీ అతని కారులోనే వెళ్లి .. అతనికి తెలియకుండా ఒక మర్డర్ చేసి .. అతనితోనే ఆ డెడ్ బాడీని నదిలోకి తోయిస్తాడు. ఆ తరువాత విషయం తెలిసి యోగిబాబు షాక్ అవుతాడు.
"అన్నా .. వాడు నిన్నేదో చేశాడు .. నువ్వు వాడిని ఏసేశావు .. అంతా బాగానే ఉంది .. కానీ మధ్యలో నన్నెందుకన్నా ఇరికించావ్" అని యోగిబాబు అమాయకంగా అడుగుతాడు. " తమ్ముడూ నిన్ను వదిలేద్దామనే అనుకున్నా .. కానీ ఇందాక 'పెద్దోళ్లు ఓ మాట చెప్పారు' అంటూ ఏదో సామెత చెప్పావే .. అది విన్న తరువాత మాత్రం నిన్ను అస్సలు వదలకూడదనుకున్నా" అంటూ రజనీ కూల్ గా చెబుతాడు. కామెడీ సీన్స్ లో ఇదే హైలైట్. ఆడిటోరియం నుంచి ఈ సీన్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.