సూర్యకుమార్ రాణించినా, మిగతా వాళ్లు విఫలం... భారీ స్కోరు సాధించలేకపోయిన భారత్
- టీమిండియా, వెస్టిండీస్ మధ్య చివరి టీ20
- అమెరికా గడ్డపై మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు
- 45 బంతుల్లో 61 పరుగులు చేసిన సూర్యకుమార్
- ఫర్వాలేదనిపించిన తిలక్ వర్మ
అమెరికాలోని లాడర్ హిల్ ప్రాంతంలో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. టీమిండియా, వెస్టిండీస్ మధ్య ఇవాళ చివరి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్ కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది.
16వ ఓవర్లో ఓసారి మ్యాచ్ నిలిచిపోవడానికి కారణమైన వర్షం, ఆఖరి ఓవర్లోనూ ప్రత్యక్షమైంది. మరో రెండు బంతులు వేస్తే టీమిండియా ఇన్నింగ్స్ ముగస్తుందనగా, మరోసారి వర్షం పడింది. అప్పటికి భారత్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం సద్దుమణగడంతో ఇన్నింగ్స్ పూర్తయింది.
టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే. సూర్యకుమార్ తన ఫామ్ కొనసాగిస్తూ 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. తెలుగుతేజం తిలక్ వర్మ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేశాడు. సంజు శాంసన్ 13, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 14, అక్షర్ పటేల్ 13 పరుగులు చేశారు.
విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 4, అకీల్ హోసీన్ 2, జాసన్ హోల్డర్ 2, రోస్టన్ చేజ్ 1 వికెట్ తీశారు.