తిరుమల నడకదారుల్లో మధ్యాహ్నం 2 తర్వాత పిల్లలకు నో పర్మిషన్

  • అలిపిరి నడకదారిలో చిన్నారి లక్షితపై చిరుత దాడి
  • తలభాగం తినేసిన స్థితిలో చిన్నారి మృతదేహం లభ్యం
  • కీలక చర్యలు తీసుకుంటున్న టీటీడీ
  • నడకదారుల్లో పిల్లల ప్రవేశంపై ఆంక్షలు
  • ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే 15 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి
తిరుమల అలిపిరి నడకదారిలో ఆరేళ్ల చిన్నారి లక్షితను చిరుతపులి చంపి తిన్న నేపథ్యంలో టీటీడీ కీలక చర్యలు తీసుకుంటోంది. తాజాగా అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారుల్లో పిల్లలపై ఆంక్షలు విధించింది. 

ఇకపై నడకదారుల్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించరాదని టీటీడీ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 ఏళ్ల లోపు పిల్లలను తిరుమల నడకదారుల్లో అనుమతించనున్నారు. 

అటు, పోలీసులు 7వ మైలు వద్ద పిల్లల చేతికి ట్యాగ్ లు వేస్తున్నారు. ఈ ట్యాగ్ పై చిన్నారి పేరు, ఫోన్ నెంబరు సహా తల్లిదండ్రుల వివరాలు, పోలీస్ విభాగం టోల్ ఫ్రీ నెంబరు ఉంటాయి. అదే సమయంలో, ఘాట్ రోడ్లలో బైక్ లను సాయంత్రం 6 గంటల తర్వాత అనుమతించబోమని టీటీడీ వెల్లడించింది.


More Telugu News