నాగార్జున లాంటి సినిమా హీరోలకూ రైతుబంధు ఇస్తున్నారు: రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి
- నటులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఎన్నారైలకూ రైతుబంధు ఇస్తున్నారన్న ఆకునూరి మురళి
- కౌలు రైతులను అసలు రైతులుగానే చూడట్లేదని వ్యాఖ్య
- దేశంలో పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణేనని విమర్శ
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకంపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో నాగార్జున లాంటి సినిమా హీరోలకూ రైతుబంధు అందుతోందని ఆరోపించారు. చాలా మంది రైతులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దృష్టిలో కౌలు రైతులు అసలు రైతులే కాదని అన్నారు.
దుక్కి దున్నే కౌలు రైతులకు కాకుండా.. దొరలకు, ధనవంతులకు, రాజకీయ నాయకులకు, సినీ నటులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఆఖరికి ఎన్నారైలకు కూడా రైతుబంధు ఇస్తున్నారని ఆరోపించారు. దేశంలో పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆరోపించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి 14 అంశాలతో కూడిన బుక్‌లెట్‌ను రూపొందించామని, ఈ బుక్‌లెట్‌ను ప్రభుత్వం ముందు ఉంచుతామని వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటిదాకా 7 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.