మళ్లీ వస్తున్న ​ప్రభాస్ ‘యోగి’

  • ఈ నెల 18న 4కె వెర్షన్‌లో యోగి రీరిలీజ్
  • అప్పట్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన
  • ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు, దర్శకుల గత చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఆధునిక హంగులు జోడించి ఆయా చిత్ర బృందాలు విడుదల చేస్తున్నసినిమాలు అభిమానుల్లో ఫుల్ జోష్‌ని నింపుతున్నాయి. దాంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలు కూడా తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం, బిల్లా చిత్రాలు 4కె వెర్షన్‌లో రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘యోగి’ చిత్రం ఈ నెల 18న 4కె వెర్షన్‌లో రీ రిలీజ్ అవుతోంది. అప్పట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా నయనతార నటించింది. 

కాగా, ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందిన ‘సలార్’ పార్ట్ 1 వచ్చే నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’తో పాటు మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు.


More Telugu News