తమిళనాడు ఆదివాసీలతో కాలుకదిపిన రాహుల్ గాంధీ.. వీడియో ఇదిగో!

  • కేరళ, తమిళనాడులో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ
  • ఊటీ సమీపంలోని ముథునాడు గ్రామస్థులతో భేటీ
  • తోడా కమ్యూనిటీ ప్రజలతో కలిసి డ్యాన్స్ చేసిన రాహుల్
కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తమిళనాడు, కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఊటీ సమీపంలోని ఆదివాసీ గ్రామం ముథునాడును రాహుల్ విజిట్ చేశారు. గ్రామస్థులతో మాట్లాడుతూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆదివాసీల సంప్రదాయ గొంగడి కప్పుకుని వారితో కలిసి కాలుకదిపారు. రాహుల్ గాంధీ ఆదివాసీలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సభ్యత్వాన్ని లోక్ సభ స్పీకర్ రద్దు చేశారు. జైలు శిక్షపై సుప్రీంకోర్టుకు వెళ్లిన రాహుల్ కు అత్యున్నత న్యాయస్థానం ఊరట కల్పించింది. కింది కోర్టు విధించిన శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన నియోజకవర్గం కేరళలోని వయనాడ్ తో పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు.


More Telugu News