8 ఏళ్ల బాలిక.. 62 కిలోలు ఎత్తి గిన్నిస్ రికార్డ్

  • హర్యానాకు చెందిన అర్షియా గోస్వామి
  • 30 సెకన్లలో 17 సార్లు క్లీన్ అండ్ జర్క్ వెయిట్‌లిఫ్టింగ్
  • అశ్రియను సన్మానించిన స్పీకర్ జ్ఞాన్‌చంద్ గుప్తా  
హర్యానాకు చెందిన 8 ఏళ్ల బాలిక ఏకంగా 62 కిలోల బరువు ఎత్తి గిన్నిస్ రికార్డు సాధించింది. పంచ్‌కుల జిల్లాకు చెందిన అర్షియా గోస్వామి 30 సెకన్లలో 17సార్లు క్లీన్ అండ్ జర్క్ వెయిట్‌లిఫ్టింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అర్షియా తండ్రి అవినాష్ కుమార్ స్థానికంగా ఓ జిమ్ నిర్వహిస్తున్నాడు. కుమార్తెకు తొలుత తన దగ్గరే శిక్షణ ఇచ్చిన అవినాష్ కుమార్ ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. 

అర్షియా ప్రస్తుతం అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్ గుర్మెల్‌సింగ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. ఓ టీవీ చానల్ నిర్వహించే ‘ఇండియాస్ గాట్ టాలెంట్’లో జులైలో అర్షియా 62 కేజీల బరువు ఎత్తి గిన్నిస్ రికార్డులకెక్కింది. ఆమె ప్రతిభకు ముగ్గుడైన హర్యానా అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్‌చంద్ గుప్తా ఘనంగా సన్మానించారు.


More Telugu News