బీజేపీని వీడిన మాజీ మంత్రి చంద్రశేఖర్

  • తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేత
  • పనిచేసే వారికి పార్టీలో ప్రోత్సాహం లేదని ఆరోపణ
  • కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న వైనం
  • ఈటల స్వయంగా చంద్రశేఖర్‌ మనసు మార్చేందుకు ప్రయత్నించినా దక్కని ఫలితం
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. పార్టీలో పనిచేసేవారికి తగిన ప్రోత్సాహం లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అయితే, త్వరలో చంద్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

చంద్రశేఖర్ 1985-2008 మధ్య వికారాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల పార్టీ నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మనసుమార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో, ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.


More Telugu News