జగన్ దళిత వ్యతిరేకి, ద్రోహి... అందుకు ఈ ఘటనలే నిదర్శనం: నారా లోకేశ్

  • పెదకూరపాడు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • దళితులతో లోకేశ్ ముఖాముఖి
  • తమ సమస్యలు లోకేశ్ కు విన్నవించిన దళితులు
  • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన లోకేశ్
  • దళితులను విమర్శించానంటూ ఫేక్ వీడియో చేయించారని ఆగ్రహం
పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు హోరెత్తిన యువగళం పాదయాత్ర శనివారం సాయంత్రం విజయవంతంగా పూర్తయింది. 182వ రోజు యువనేత లోకేశ్ పాదయాత్ర గారపాడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా... లగడపాడు, పెదకూరపాడు, లింగంగుంట్ల, పొడపాడు మీదగా సిరిపురం శివార్లలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సిరిపురం శివార్లలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ నేతృత్వంలో యువనేతకు తాడికొండ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు పెదకూరపాడులో లోకేశ్ దళితులతో ముఖాముఖి నిర్వహించారు. 

దళితులతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్ వ్యాఖ్యలు...

జగన్ దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి

ముఖ్యమంత్రి జగన్ కు దళితులకు కనీస గౌరవం ఇచ్చే మనస్సు లేదు, మంత్రి పినిపే విశ్వరూప్ ను మోకాళ్ళపై కూర్చోబెట్టారు, ఇంకో మంత్రి నారాయణ స్వామిని కూడా గతంలో వేదికపై నిలబెట్టి అవమానించారు, అదీ జగన్ దళితులకు ఇచ్చే గౌరవం. దళిత ద్రోహి జగన్ విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరు తొలగించాడు. 

దళితులకు గత ప్రభుత్వం 27 సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే, జగన్ వాటిని రద్దు చేశాడు, ప్రశ్నించిన దళితులను కిరాతకంగా చంపేశాడు. కరోనా సమయంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని వేధించి చంపేశారు. తాడిపత్రి సీఐ ఆనందరావుని తప్పుడు కేసులు పెట్టలేదని వేధించి చంపేశారు. నాసిరకం మద్యంపై ప్రశ్నించిన దళిత యువకుడు ఓం ప్రతాప్ ని పుంగనూరు లో పాపాల పెద్దిరెడ్డి చంపేశాడు. 

దళితులను చంపేస్తుంటే సంఘాలు భయపడి మాట్లాడటం లేదు. దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. దళిత రైతులకి సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ అక్రమంగా పెట్టిన కేసులు అన్నీ తొలగిస్తాం.

అమరావతి దళిత రైతుల తరపున పోరాటం చేసినందుకు మొదటిసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లాను. దళిత యువతి రమ్యని హత్య చేసినప్పుడు పోరాడినందుకు నేను రెండోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. దళిత డ్రైవర్ సుబ్రమణ్యంని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకి వైసీపీ నేతలు సన్మానాలు చేస్తున్నారు. 

టీడీపీ హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ కోసం 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. దళిత వాడల్లో సీసీ రోడ్లు వేశాం. నేను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఇలా అన్ని అభివృద్ది కార్యక్రమాలు దళిత కాలనీల నుండే ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకున్నా. 

అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్య పథకం తీసుకొచ్చి దళిత యువత ఉన్నత విద్య చదువుకి సాయం అందించాం. 2.70 లక్షల మంది దళితులకు స్వయం ఉపాధి కల్పించాం. ఇన్నోవాలు, జేసీబీలు, వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు అందించాం.

నా మీద ఫేక్ వీడియో చేయించారు!

జగన్ పాలనలో అత్యధికంగా నష్టపోయింది దళితులు. విదేశీ విద్య లాంటి పథకాలను రద్దు చేశాడు. లోకేశ్ దళితులను అవమానించాడు అంటూ నా మీద ఫేక్ వీడియో తయారు చేశారు. నేను సవాల్ చేస్తే పారిపోయాడు. జగన్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో, ఎస్సీ కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. 

జగన్ వసతి దీవెన, విద్యా దీవెన అనే రెండు పనికిమాలిన కార్యక్రమాలు జగన్ తీసుకొచ్చాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. వన్ టైం సెటిల్మెంట్ చేసి సర్టిఫికేట్లు ఇప్పిస్తాం.

సిగ్గుంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలి!

శాండ్ శంకర్ కి సిగ్గుంటే రాజీనామా చెయ్యాలి. అమ్మ లాంటి అమరావతిని చంపేస్తుంటే చప్పట్లు కొట్టాడు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500... జగన్ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.5000 వేలు. ఇప్పుడు ఆ డబ్బు ఎవరు తింటున్నారు? ఇసుకలో జగన్ కి రోజు ఆదాయం రూ.3 కోట్లు. 

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2441.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 21.9 కి.మీ.*

*183వరోజు (13-8-2023) యువగళం వివరాలు*

*తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరుజిల్లా)*

ఉదయం

8.00 – సిరిపురం శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.00 – సిరిపురంలో స్థానికులతో సమావేశం.

11.00 – వరగానిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

మధ్యాహ్నం

12.30 – రావెలలో స్థానికులతో సమావేశం.

12.45 – రావెల శివార్లలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – రావెల శివార్లలో అమరావతి రైతులతో లోకేశ్ కార్యక్రమం.

6.00 – రావెల శివారు విడిది కేంద్రంలో బస.

******





More Telugu News