హెట్మెయర్, హోప్ దూకుడు... టీమిండియా ముందు 179 పరుగుల టార్గెట్
- టీమిండియా, విండీస్ మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
- చివరి రెండు మ్యాచ్ లకు అమెరికా ఆతిథ్యం
- 39 బంతుల్లో 61 పరుగులు చేసిన హెట్మెయర్
- 29 బంతుల్లో 45 పరుగులు చేసిన షాయ్ హోప్
- 3 వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లోని చివరి రెండు మ్యాచ్ లకు అమెరికా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని లాడర్ హిల్ లో ఇవాళ ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది.
ఇక్కడి సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్, షిమ్రోన్ హెట్మెయర్ దూకుడుగా ఆడడంతో విండీస్ భారీ స్కోరు దిశగా పయనించింది.
ముఖ్యంగా, హెట్మెయర్ చిచ్చరపిడుగులా ఆడాడు. భారత బౌలర్లను చితకబాదిన హెట్మెయర్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు సాధించాడు. హోప్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. ఇక, అర్షదీప్ సింగ్ విసిరిన ఇన్నింగ్స్ చివరి బంతిని ఆల్ రౌండర్ ఓడియన్ స్మిత్ సిక్స్ కొట్టడం విశేషం.
టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ 1, చహల్ 1, ముఖేశ్ కుమార్ 1 వికెట్ తీశారు.