నైజర్ దేశం నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి: విదేశాంగ శాఖ అత్యవసర ప్రకటన

  • ఆఫ్రికా దేశం నైజర్ లో సైనిక తిరుగుబాటు
  • నిలిచిపోయిన విమానాల రాకపోకలు
  • భారతీయులకు విదేశాంగ శాఖ సూచనలు
  • భూమార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్న విదేశాంగ శాఖ 
  • రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని వెల్లడి
  • అత్యవసర హెల్ప్ లైన్ల ఏర్పాటు
ఆఫ్రికా దేశం నైజర్ లో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నైజర్ లోని భారతీయులు వెంటనే వెనక్కి వచ్చేయాలని విదేశాంగ శాఖ ఓ ప్రకటన  చేసింది. 

నైజర్ లో సైన్యం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి భూమార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని భారతీయ పౌరులకు విదేశాంగ శాఖ సూచన చేసింది. నియామీ నగరంలోని భారత రాయబార కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని భారతీయులకు స్పష్టం చేసింది. 

భారతీయ పౌరుల కోసం 227 9975 9975 ఎమర్జెన్సీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీఎస్ 91 85000 27678, 0863 2340678 హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది.


More Telugu News