కూతురు తుల్జాభవానికి నోటీసులు పంపించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
- కొన్నిరోజులుగా తండ్రిపై విమర్శలు చేస్తున్న కూతురు తుల్జాభవాని
- పరువుకు భంగం కలిగిస్తున్నారని కోర్టు ద్వారా నోటీసులు పంపిన ముత్తిరెడ్డి
- మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు
తన పరువుకు నష్టం కలిగిస్తోందని, తనపై ఆరోపణలు చేయవద్దంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోర్టు ద్వారా తన కూతురు తుల్జాభవానిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. గత కొన్నిరోజులుగా తన తండ్రిపై తుల్జాభవానిరెడ్డి తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే తనపై ఇష్టారీతిన ఆరోపణలు చేయకుండా నిలువరించేలా కోర్టు ద్వారా ముత్తిరెడ్డి కూతురుకు నోటీసులు జారీ చేశారు.
తన పరువుకు భంగం కలిగించేలా కూతురు తుల్జాభవానీరెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని, అందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ముత్తిరెడ్డి విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది.
ప్రెస్, మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు, యూట్యూబ్, ఇతర ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మౌఖికంగా లేదా రాతపూర్వకంగా, నేరుగా లేదా పరోక్షంగా మాట్లాడవద్దని తుల్జాభవానిరెడ్డికి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.